13 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టెక్కీ..

by Disha Web |
13 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టెక్కీ..
X

దిశ, వెబ్ డెస్క్: కొంత మంది దుర్మార్గులు ఆన్‌లైన్‌లో కూడా అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అమ్మాయిలు ఎక్క కనిపించినా వదలడం లేదు. ఏదో విధంగా వారిపై దాడులకు పాల్పడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఏకంగా 13 మంది మహిళను లైంగికంగా వేధించాడు.

వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగుళూరులో 28 ఏళ్ల దిలీప్ ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన మహిళలకు ఎర వేశాడు. ప్లాన్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళా పేర్లతో పలు ఖాతాలను ఒపెన్ చేశాడు. ఆ తర్వాత ఐటీలో మేనేజర్‌ను అంటూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం పేరుతో వారిని హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వాటిని ఫోన్‌లో వీడియోలు తీసి బెదిరించేవాడు. ఇలా ఏకంగా 13 మంది మహిళలపై ఆ టెక్కీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది భరించలేని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Next Story