ఎన్‌కౌంటర్ లో 12 మంది నక్సలైట్లు హతం..

by Sumithra |   ( Updated:2025-02-09 05:56:57.0  )
ఎన్‌కౌంటర్ లో 12 మంది నక్సలైట్లు హతం..
X

దిశ, భద్రాచలం : మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో ఉన్న నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, మహారాష్ట్ర పోలీసుల సి - 60 కమాండో యూనిట్ సంయుక్త చర్యలో, 12 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారని సమాచారం. అయితే, ఈ సంఖ్య ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ ఎన్‌కౌంటర్‌లో మరింత మంది నక్సలైట్లు హతమయ్యి ఉండొచ్చనే సమాచారం.

Advertisement
Next Story