ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 11 మంది మృతి

by Satheesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 11 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భాటపరా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తోన్న ట్రక్కును శుక్రవారం ఉదయం మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 11 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed