2020 క్రైమ్‌ డేటా.. దేశ రాజధానిలో 5 గంటలకో అత్యాచారం..!

by  |
2020 క్రైమ్‌ డేటా.. దేశ రాజధానిలో 5 గంటలకో అత్యాచారం..!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020లో దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ 5 గంటలకు ఒక రేప్ జరిగినట్టు క్రైమ్‌ డేటా వెల్లడించింది. ప్రతీ 15 నిమిషాలకు ఒక దొంగతనం జరుగగా.. ప్రతీ 19 గంటలకు ఒక హత్య చేసినట్టు డేటా స్పష్టం చేసింది. కానీ, 2019 కంటే 2020లోనే క్రైమ్ రేట్ 16 శాతం వరకు తగ్గిందని పేర్కొంది. 2019లో క్రైమ్ డేటా ప్రకారం.. ప్రతీ 4 గంటల్లో ఒక అత్యాచారం, 12 నిమిషాల్లో దొంగతనం, 17 గంటలకో హత్యలు జరిగినట్టు గుర్తు చేసింది.

2019-2020 క్రైమ్ డేటాను పూర్తిగా పరిశీలిస్తే.. 2019లో మొత్తంగా 3,16,261 కేసులు నమోదు చేశారు. ఇదే సంవత్సరంలో 1,09,138 నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 3,01,085 FIRలు నమోదు చేశారు. ఇక 2020లో మొత్తంగా 2,66,070 కేసులు రిజిస్ట్రర్ అయ్యాయి. ఇందులో 1,25,986 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో 2,50,324 FIR‌లను రికార్డ్ చేశారు. అయితే, 2020లో దాదాపు 9 నెలల పాటు లాక్‌డౌన్ అమలులో ఉండడంతో జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో క్రైమ్ రేటు కూడా తగ్గి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed