యువీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వాపస్

by  |
యువీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వాపస్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన యువీ.. జట్టులో స్థానం కోల్పోవడంతో గతేడాది జూన్‌లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు ఆ తర్వాత కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20లీగ్‌లో పాల్గొన్నాడు. కాగా, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పునీత్ బాలి గత కొన్నాళ్లుగా యువరాజ్ తిరిగి దేశవాళి ఆడాలని పట్టుబట్టాడు. యువీ తరపున బీసీసీఐతో చర్చలు జరిపాడు. ఎట్టకేలకు బోర్డు అతడు తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇవ్వడంతో యువీ పంజాబ్ తరపున ఆడటానికి సిద్ధమయ్యాడు. యువీ తన రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు తెలియడంతో వచ్చే నెలలో జరుగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్‌లో యువీకి చోటు దక్కింది. యువరాజ్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బయటకు వెల్లడించకపోయినా.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు మాత్రం సమాచారం అందించినట్లు తెలుస్తున్నది.

మరోవైపు నిషేధం కారణంగా ఏడేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీశాంత్ కూడా కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు సంపాదించాడు. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించింది. దీనిపై శ్రీశాంత్ కోర్టుకు ఎక్కగా.. అతడి నిషేధాన్ని 7 ఏళ్లకు తగ్గించింది. ఈ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. దీంతో తాను తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. శ్రీశాంత్ అందుబాటులోకి రావడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. శ్రీశాంత్ చివరి సారిగా 2011లో భారత జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దేశవాళీలో సత్తా చాటి ఐపీఎల్‌లో స్థానం సంపాదించాలని కలలు కంటున్నాడు.


Next Story

Most Viewed