ఆ వీరుల బలిదానం వృథా కానివ్వం

by  |
ఆ వీరుల బలిదానం వృథా కానివ్వం
X

దిశ, పటాన్‌చెరు: వీరుల బలిదానాలు వృథా కానివ్వబోమని సీపీఐ(ఎం) నాయకులు వాజిద్ అలీ అన్నారు. శుక్రవారం విద్యుత్ అమరవీరుల 20వ వర్ధంతి సందర్భంగా పటాన్‌చెరు‌లోని శ్రామిక భవన్‌లో అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ… 2000 సంవత్సరం ఆగస్టు 28న చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయని అన్నారు.

ఈ ఉద్యమం సందర్భంగా బషీర్‌బాగ్ చౌరస్తాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామిలు, తూటాలకు బలి అయ్యారని తెలిపారు. వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రతిఏడాది, వారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నామన్నారు. ఆ పోరాటం తర్వాత పాలకులు విద్యుత్ సంస్కరణలు చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు. వారి త్యాగం వృథాగా పోదని, వారి త్యాగ ఫలితమే నేడు రైతులకు ఉచిత విద్యుత్ రైతులకు అందుతుందని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ విద్యుత్ సంస్కరణలకు పూనుకుంటుందని ప్రజలపై భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని లేదంటే గత ప్రభుత్వాలకు పట్టినగతి ఈ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు.

Next Story

Most Viewed