దేశంలో నేటికీ కుల వివక్షత ఉంది.. ముక్తి సత్యం ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
CPI(ML) leader Mukti Satyam
X

దిశ, గుండాల: మహాత్మ జ్యోతీరావ్ పూలే స్థాపించిన ‘సత్యశోదక్ సమాజ్’ 149వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘కుల నిర్మూల‌న‌’ కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ(ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ‘కుల రక్కసి’ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎమ్ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ… గత 149 ఏండ్ల క్రితం జ్యోతీరావ్ పూలే కుల వివక్షతకు వ్యతిరేకంగా ‘సత్యశోధక్ సమాజ్’ స్థాపించారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా కుల వివక్షత, కుల పీడన, హిందూ, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశాడని అన్నారు. 70 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశం అని చెప్పుకుంటున్న ఈ దేశంలో నేటికీ కుల వివక్షత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి నరేష్, లాలయ్య, సారన్న, మంగన్న, పెంటన్న, రియాజ్, కృష్ణన్న, భాస్కర్ పాల్గొన్నారు.

Next Story