మద్యం ధరలు కాదు.. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించండి: సీపీఐ రామకృష్ణ

by  |
CPI Ramakrishna
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం ధరలు తగ్గిస్తే ప్రభుత్వానికి తప్ప ప్రజలకు ఏమి లాభం అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గిస్తే ఎవరికి ప్రయోజనం అంటూ నిలదీశారు. ‘పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో లీటర్‌కు రూ.10లు అధికంగా ఉంది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జీవో ఇచ్చారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారు. ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడివున్న పెట్రో ధరలు తగ్గించకుండా మద్యం ధరలను తగ్గించారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం తమిళనాడుతో సమానంగా తగ్గించాలి అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.

Next Story