ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం లేదు.. న్యూ డెమోక్రసీ కీలక ప్రకటన

by Sridhar Babu |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం లేదు.. న్యూ డెమోక్రసీ కీలక ప్రకటన
X

దిశ, గుండాల: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, నార్త్-ఈస్ట్ తెలంగాణ రీజినల్ పరిధిలో తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు ఓట్లు ఉన్నాయని, ఈ ఓట్లు పోటీలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని తెలిపారు. ఎవరికి ఓటు వేయడం లేదని బుధవారం ఇల్లందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రీజినల్ కమిటీ అధికార ప్రతినిధి ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం స్పష్టం చేశారు. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

న్యూ డెమోక్రసీ డబ్బును, పదవులను వ్యతిరేకిస్తూ ప్రజా అభివృద్ధే లక్ష్యంగా సమాజ మార్పుకై కృషి చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలను లక్షల రూపాయలతో కొనుగోలు చేస్తున్నారని, అయినా వీటిని వ్యతిరేకిస్తూ ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకుండా నిలబడటం అనేది తమ పార్టీ రాజకీయాలకు వన్నె తెచ్చే విధంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుండాల జడ్పీటీసీ వాగబోయిన రామక్క, పోలారం ఎంపీటీసీ ఈసాల పాపమ్మ, మాణిక్యారం ఎంపీటీసీ బాణోత్ రోజా, శంభునిగూడెం ఎంపీటీసీ పర్షిక పద్మ, రోళ్లగడ్డ ఎంపీటీసీ కల్తి రాజేశ్వరి, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, మాణిక్యారం సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ, మర్రిగూడెం సర్పంచ్ చింత రజిత, పోలారం సర్పంచ్ వాంకుడోత్ సరోజన, బోయతండా సర్పంచ్ సంతు, పోచారం సర్పంచ్ వాంకుడోత్ శీను, రొంపేడు సర్పంచ్ ఆజ్మీరా శంకర్, పార్టీ జిల్లా నాయకులు పుల్లన్న, తుపాకులు నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story