ఆహారంపై ఆంక్షలు ఏంటి.. సీపీఐ నారాయణ ఆగ్రహం

by  |
ఆహారంపై ఆంక్షలు ఏంటి.. సీపీఐ నారాయణ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లక్షద్వీప్ ప్రజలకు మద్దతు ప్రకటిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు తినే ఆహారంపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘‘లక్షద్వీప్ ప్రజలకు అండగా ఉందాం.. లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లక్షద్వీప్‌లో ముస్లిం, మైనార్టీలపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ‘డెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్‌ (2021)’పై లక్షద్వీప్‌ భగ్గుమంటోంది. ద్వీపకల్ప భూమిలో ఆ డ్రాఫ్ట్‌ అగ్గి రాజేసింది. ప్రజలతో పాటు ప్రముఖులందరూ ‘లక్షద్వీప్‌ను రక్షించండి(సేవ్‌ లక్షద్వీప్‌)’ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


Next Story