రైతు వేదిక పేరుతో.. భూమి లాక్కోవడం అన్యాయం

by  |
రైతు వేదిక పేరుతో.. భూమి లాక్కోవడం అన్యాయం
X

దిశ, హుస్నాబాద్: దళితుల భూములు లాక్కోవడం అన్యాయమని సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్ అన్నారు. గురువారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బ్యాగరి నర్సింహులుకు వారసత్వంగా వస్తున్న 13 గుంటల వ్యవసాయ భూమిని రైతు వేదిక పేరుతో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. దీంతో రైతు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నాడని తెలిపారు. రైతు ఆత్మహత్యకు కారకులైనా తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓలతో పాటు ప్రజా ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాకుండా ఉన్నత స్థాయి కమిటీ వేయాలన్నారు. రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ రైతులనే బలితీసుకుంటుందని మండిపడ్డారు.

Next Story