తిట్టుకుంటే నీళ్లు రావు.. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై సీపీఐ నారాయణ ఫైర్

by  |
CPI-leader-Narayana,-Minist
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజలకు ఉద్దేశిస్తూ.. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షాసులే అని, తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని, ఆంధ్రోళ్లు ఏనాడూ తెలంగాణ ప్రజల మేలు కోరుకోరు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన సీపీఐ నారాయణ ప్రశాంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లంకలో పుట్టినోల్లంతా రాక్షసులే అన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవరివైనా సరే ఊరుకునేదు’’ అని ఫైర్ అయ్యారు.

కృష్ణానది నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుంది తప్ప ఒకరినొకరు తిట్టుకుంటే నీళ్లు రావు అని సూచించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ఆంధ్రావాళ్ళని తిట్టే ఎత్తుగడ వేస్తాడని అన్నారు. అంతేగాకుండా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాత్రిపూట రహస్యంగా మాట్లాడుకుంటారు తప్ప ఇలాంటి నీళ్ల సమస్యల్లో కలిసి పగలు కూర్చుని మాట్లాడుకోరు అని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి సీపీఐ పని చేస్తోందని, రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ నిలబడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి రాష్ట్రపతిగా శరద్ పవార్‌ని గెలిపిస్తే బీజేపీ పతనం ప్రారంభమయినట్టే అని అంటూ విమర్శించారు.

Next Story

Most Viewed