చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత నారాయణ..

147
MEGA STAR

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో చిరంజీవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మెగాస్టార్, సీఎం జగన్‌ను కలవడం గురించి ఆయన మాట్లాడారు. సమస్య చిరంజీవి ఒక్కడిదే కాదు.. మొత్తం సినీ పరిశ్రమది. అలాంటప్పుడు ఆయన ఒక్కడే వెళ్లి సీఎం జగన్‌ను కలవడం పొరపాటు. సినిమా రంగానికి చెందిన అసోసియేషన్ల వ్యక్తులను కూడా సీఎం దగ్గరకు తీసుకువెళ్లాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి ఒంటరిగా వెళ్లి కలవడం వల్లే వారి భేటి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు.