తెలుగు అకాడమీ స్కాం.. కీలక విషయాలు బయటపెట్టిన సీపీ అంజనీ కుమార్

by  |
తెలుగు అకాడమీ స్కాం.. కీలక విషయాలు బయటపెట్టిన సీపీ అంజనీ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో. తెలుగు అకాడమీలో ఇప్పటివరకు 64.50 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్ లో 3 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి విచారించామన్నారు. ఇప్పటి వరకు పది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. యూనియన్ బ్యాంక్ ద్వారా సెప్టెంబర్ 27వ తేదీన తమకు ఫిర్యాదు అందగా.. వేగంగా విచారణను షురూ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు దఫదఫాలుగా నిధులను డ్రా చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

తెలుగు అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ సెగూరి రమేష్ , చందా నగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన , రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట కోటి సాయి కుమార్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. సాయి కుమార్ ప్రమేయం ఈ కేసులో చాలా కీలకంగా ఉందన్నారు. అతనిపై గతంలో మూడు పాత కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.



Next Story

Most Viewed