రికార్డు స్థాయిలో కేసులు 

by  |
రికార్డు స్థాయిలో కేసులు 
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా రికార్డు స్థాయిలో 82,170 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క ‌రోజులోనే 1,039 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 95 వేలు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో క‌రోనా కేసులు 6 మిలియ‌న్లు దాటేశాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. మొత్తం కేసులు 60,74,703కు చేరుకున్న‌ట్లు పేర్కొంది.

కోవిడ్ కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా అదే స్థాయిలో పెరగడం ఊరటనిస్తోందని తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే దేశ వ్యాప్తంగా 74,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 50,16,520 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీ రేటు 82.58 శాతంగా ఉండ‌గా, మొత్తం న‌మోదైన కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.85 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం 9,62,640 యాక్టివ్ కేసులున్న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌ర‌ణాల రేటు సైతం 1.57 శాతానికి తగ్గిన‌ట్లు కేంద్రం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గత 24 గంట‌ల్లోనే దేశంలో 7,09,394 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 7,19,67,230 కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

Next Story