మూడో త్రైమాసికంలో జీడీపీ సానుకూలం : ఆర్‌బీఐ

by  |
మూడో త్రైమాసికంలో జీడీపీ సానుకూలం : ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పునరుద్ధరణ వి-ఆకారంలో ఉంటుందని, ఇందులో వీ అంటే వ్యాక్సిన్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తన ‘ఆర్థికవ్యవస్థ-2020’ నివేదికలో పేర్కొంది. 2020 ఏడాది అన్ని విభాగాల్లో మార్పులను తీసుకొచ్చింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. భారత్‌లో స్థూల ఆర్థిక రంగ దృక్పథం మారింది. జీడీపీ సానుకూలంగా ఉంది, అదేవిధంగా ద్రవ్యోల్బణం లక్ష్యానికి దగ్గరగా ఉందని ఆర్‌బీఐ తన నివేదికలో తెలిపింది. మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలంగా ఉండొచ్చని ఆర్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.

2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో జీడీపీ వృద్ధి వినియోగంపై ఆధారపడి కొనసాగే అవకాశం ఉందని, గతేడాది వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధిని సాధించిందని, 2021లో ఇదే ధోరణి కొనసాగుతుందనే అంచనాలున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఉత్పత్తి కార్యకలాపాల పునరుజ్జీవనం నేపథ్యంలో సరఫరా వ్యవస్థ డిసెంబర్‌లో బలపడిందని ఆర్‌బీఐ పేర్కొంది. కరోనా పూర్వస్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ సేవల రంగ కార్యకలాపాలు కూడా తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నాయని వెల్లడించింది.



Next Story

Most Viewed