ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం

by  |
ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరో ఆరు రోజులే ఉన్న నేపథ్యంలో ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం సృష్టించడం ఆందోళన కలిగిస్తున్నది. పూర్తి బయోబబుల్ వాతావరణలో, అత్యంత సురక్షిత ప్రదేశంగా గుర్తింపు పొందిన ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. క్రీడా గ్రామంలో అధికారిగా పని చేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆ అధికారిని 14 రోజుల క్వారంటైన్‌కు తరలించినట్లు కమిటీ వెల్లడించింది. ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న 44 మంది జులై 1 నుంచి ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారని టోక్యో ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. కొత్తగా కరోనా సోకిన 13 మంది ఐవోసీ, పారాలింపిక్ కమిటీ, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్‌కు చెందిన వారిగా తెలుస్తున్నది. వీరందరినీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టోక్యోలో వరుసగా 27వ రోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 1271 కరోనా కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారింది.

Next Story

Most Viewed