‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి’

by  |
couple, innovative attempt
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఏడాదిన్న నుంచి నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్‌కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. తాజాగా… మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. దీంతో వైరస్ బారినుంచి తప్పించుకోవాలంటే వ్యక్తిగత చర్యలు తీసుకోవడం అనివార్యం అని భావించిన ప్రజలు ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ దంపతులు వినూత్నంగా ప్రయత్నించారు. ‘‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి’’ అని ఇంటిముందు గేటుకు ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చార్యానికి గురిచేశారు. ఆ ప్లెక్సీ చూసిన అందరూ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి శభాష్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed