నకిలీ చలానాల కుంభకోణం కేసు.. ముగ్గురు అరెస్ట్

by  |
నకిలీ చలానాల కుంభకోణం కేసు.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఈ నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన కడపలో ముగ్గురు స్టాంప్‌ రైటర్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారు జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు కడప అర్బన్‌, రూరల్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story