వచ్చే ఏడాది కరోనా అంతం: బిల్‌గేట్స్

by  |
వచ్చే ఏడాది కరోనా అంతం: బిల్‌గేట్స్
X

దిశ, వెబ్ డెస్క్: చాలా దేశాల్లో వచ్చే ఏడాదిలోపు కరోనా(kovid-19) మహమ్మారి అంతమవుతుందని మైక్రోసాఫ్ట్ (microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(bill gates) అన్నారు. కరోనాకు త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లోపు మెజార్టీ దేశాల్లో వైరస్ అంతమవుతుందన్నారు. ఆంగ్ల పత్రిక వైర్డ్‌(wired)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిలో పడటం చాలా కష్టమన్నారు. అయితే, ఈ వైరస్ దాని నివారణకు కొత్త ఆవిష్కరణలు(new inventions), పరిశోధనలు(researches), చికిత్స విధానాల, టీకా (vaccine) పరిశోధనలను ముమ్మరం చేసిందని వివరించారు. 2021లోపు సంపన్న దేశాలు(capitalist countries) కరోనాను అంతమొందిచగలవని, 2022లోపు యావత్ ప్రపంచమంతా ఈ మహమ్మారిని తుదముట్టించగలదని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed