కరోనా కాలంలో బిలియనీర్ అయిన భారతీయ డాక్టర్

by  |
కరోనా కాలంలో బిలియనీర్ అయిన భారతీయ డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా సమయంలో ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక భారతీయ డాక్టర్ మాత్రం అమాంతం బిలియనీర్ అయిపోయారు. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ యజమాని డాక్టర్ అరవింద్ లాల్ ఆస్తి 1 బిలియన్ డాలర్ దాటిపోయింది. భారతదేశంలో ఆయన డయాగ్నిస్టిక్ సెంటర్ల షేర్ల విలువ పెరగడంతో ఆయన ఆస్తి పెరిగింది.

మార్చి చివరి వారంలో డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ వారికి కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి లభించింది. లాక్‌డౌన్ తొలివారం వరకి కేవలం ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు మాత్రమే కరోనా టెస్టులు చేసేవి. కానీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ల్యాబుల్లో డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ వారికి అనుమతి లభించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ లాల్ చెయిన్‌ విలువ 174 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఒక బిలియన్ దాటిపోయింది. ప్రస్తుతం ఇది తమ అతిపెద్ద ల్యాబ్ నెట్‌వర్క్ సాయంతో ఒక రోజులో 5000కి పైగా కరోనా టెస్టులు చేస్తోంది. దాదాపు పది రాష్ట్రాల నుంచి మొబైల్ వ్యాన్ల ద్వారా శాంపిళ్లు సేకరించి, తమ ల్యాబ్‌లలో పరీక్షించి 24 గంటల్లో ఫలితాలను చెబుతోంది.

Tags: corona, covid, dr lal, path labs, tests, billionaire, network, samples


Next Story

Most Viewed