భారీగా తగ్గిన ప్యాసింజర్ వాహన విక్రయాలు!

by  |
భారీగా తగ్గిన ప్యాసింజర్ వాహన విక్రయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటోరంగాన్ని కరోనా సంక్షోభం ఇంకా వీడలేదు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత జూన్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చర్‌(సియామ్) మంగళవారం తాజా గణాంకాలను వెల్లడించింది. ఇండియాలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జూన్ నెలకు 49.59 శాతం క్షీణించి, 1,05,617 యూనిట్లకు చేరుకున్నట్టు సియామ్ తెలిపింది. గతేడాది ఇదే నెలలో 2,09,522 యూనిట్లుగా నమోదైంది. రానున్న కొద్దిరోజుల్లో ఆటో పరిశ్రమ కరోనా సంక్షోభం నుంచి మెల్లగా కోలుకుంటుందని ఇండస్ట్రీ బాడీ సియామ్ పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా 38.56 శాతం తగ్గి 10,13,431 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ద్విచక్ర వాహనాలు 16,49,475 యూనిట్లుగా నమోదయ్యాయి. మొటార్‌సైకిల్ విక్రయాలు 7,02,970 యూనిట్లతో 35.19 శాతం తగ్గి క్షీణించాయి. స్కూటర్ అమ్మకాలు 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్ల వద్ద ఉండగా, గతేడాది ఇదే నెలలో 5,12,626 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Next Story