దయచేసి మా ఇంటికి రావొద్దు!

by  |
దయచేసి మా ఇంటికి రావొద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న, మొన్నటి వరకు మనం చుట్టాలింటికి వెళ్లినా, వాళ్లు మన ఇంటికి వచ్చినా పలకరింపులు, చిన్న, చిన్న మర్యాదలు ఉండేవి. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని అన్నీ బంద్ అయిపోయాయి. చుట్టాల దాక ఎందుకు మన పక్కింటివారిని కూడా ఇంట్లోకి రానిచ్చే పరిస్థితులు లేకుండాపోయాయి. ఇద్దరు కలిసి అరుగుమీద బాతాఖానీ పెట్టి, షాపులో మంచినీళ్లు తాగే రోజులు సైతం పోస్టుపోన్ అయ్యాయి. కనీసం మా ఇంట్లో మంచినీళ్లు అయిపోయాయని అడిగినా ఇచ్చే నాథుడు కరువయ్యాడు.

ప్రజెంట్ కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో ఇంటి ముందట బోర్డులు ఏర్పాటు చేసి ఎవరూ తమ ఇంటికి రావొద్దని చెబుతున్నారు. దయచేసి మా ఇంటికి ఎవరూ రావొద్దు. మేం కూడా ఎవరి ఇంటికి వెళ్లట్లేదన్న సూచనను గేట్లకు అతికించేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం క్వారంటైన్‌లో ఉన్నాం. ఈ నెల 31 వరకు మమ్మల్ని డిస్ట్రబ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ ఇంటి గేటును కూడా తాకొద్దని వేడుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే పైన మనకు కనిపిస్తున్న ఫొటో. ఇది దేశ రాజధాని ఢిల్లీలోని వీధిలో ఓ కుటుంబం ఏర్పాటు చేసుకొన్న నోటీస్ బోర్డు. ప్రస్తుతం సమయం భవిష్యత్, ప్రాణానికి సంబంధించిన విషయమని గుర్తు చూస్తూ నోటీసులు అతికించారు.

కరోనా టెర్రర్‌తో తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించినా కొందరు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో భయానికి గురవుతున్న కొన్ని ఫ్యామిలీలు ఇలాగే ఇంటి గోడలకు, గేట్లకు బోర్డులను ఏర్పాటు చేసుకున్నాయి. దయచేసి తమ ఇంటికి ఎవరూ రావొద్దని ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకొచ్చు కానీ, లాక్‌డౌన్‌ను బేఖాతరు చేయకుండా ఈ నెల 31 వరకు తమ ఇంటి పరిసరాల్లోకి రావొద్దంటున్నారు. వచ్చి పిలిచి మమ్మల్ని డిస్ట్రబ్ చేసి, కరోనా బారిన పడేయొద్దని వేడుకుంటున్నారు.

Tags: Coronavirus, Delhi, Notice Board, March 31, Quarantine, Request, Family Members

Next Story

Most Viewed