కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా

by Javid Pasha |
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా తాజాగా ర‌క్ష‌ణ‌ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్యుల బృందం రాజ్ నాథ్ సింగ్ ను పరీక్షించిందని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది. దీంతో ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన వెళ్లలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఉన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కాగా ఇటీవలే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇక కరోనా కేసులు ఎక్కువవుతోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.Next Story

Most Viewed