సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. జడ్జీలు, లాయర్లకు పాజిటివ్

by Disha Web Desk 2 |
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. జడ్జీలు, లాయర్లకు పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కరోనా మహమ్మారి కలకలం రేపింది. పలువురు జడ్జీలు, లాయర్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల కొంత మంది న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో న్యాయమూర్తులకు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో నేటి నుంచి సుప్రీంకోర్టులో కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అందరూ మాస్క్‌లు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Next Story