కరోనా ఖతం కాలేదు, జాగ్రత్తగా ఉండాలి: డబ్ల్యూహెచ్‌వో

by  |
కరోనా ఖతం కాలేదు, జాగ్రత్తగా ఉండాలి: డబ్ల్యూహెచ్‌వో
X

జెనీవా: లాక్‌డౌన్ సడలింపులనిస్తున్న కొన్ని దేశాల్లో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ధృవీకరించింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలే స్వయంగా బాధ్యత తీసుకుని జాగ్రత్తగా మెదలాలని సూచించింది. ప్రజలు ఏమరుపాటుగా ఉండరాదని, కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని గుర్తుచేసింది. ఈ ప్రపంచం నుంచే కరోనా పూర్తిగా సమసిపోనంత వరకూ ఈ మహమ్మారి కథ ముగియనట్టేనని తెలిపింది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పుడు, భౌతిక దూరంలాంటి కొన్ని జాగ్రత్తలు నీరుగారిపోతున్నప్పుడు పరిస్థితులన్నీ సర్దుకున్నాయిలే అన్నట్టుగా ప్రజలు భావిస్తుంటారని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్ హారిస్ ఇక్కడ వివరించారు. కానీ, ప్రపంచంలో ఎక్కడ కరోనామహ్మారి ఉన్నా వైరస్ ఇంకా ఉన్నట్టేనని గుర్తించుకోవాలని చెప్పారు. తాము కేవలం యూరప్ దేశాల గురించే మాట్లాడటం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని తెలిపారు. అమెరికాలో జాతివివక్షను నిరసిస్తున్న ప్రదర్శనకారులూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed