కరోనా నివారణకు రూ. 116 కోట్ల మంజూరు

by  |
కరోనా నివారణకు రూ. 116 కోట్ల మంజూరు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి చెందిన నిధుల్లోంచి రూ. 116.25 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ పరిపాలనా విభాగం అనుమతులు మంజూరు చేసింది. ఇందులో రూ. 83.25 కోట్లు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, లక్షణాలు కలిగినవారికి వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్లు, దుస్తులు, వైద్య పరీక్షలు, మందులు తదితరాలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖర్చు చేస్తుంది. మిగిలిన రూ. 33 కోట్లను పేషెంట్లకు, అనుమానితులకు అవసరమైన వైద్య పరీక్షలు, అదనపు ల్యాబ్‌ల ఏర్పాటు, వెంటిలేటర్లు, థెర్మల్ స్కానర్లు, వైద్యసిబ్బంది స్వీయ రక్షణ ఉపకరణాలు తదితరాలకు ఖర్చు చేస్తుందని విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నిధులను ఖర్చు చేయడానికి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు అప్పజెప్పామని, వివిధ పద్దుల కింద వినియోగం ఉంటుందని, సకాలంలో వినియోగ ధృవీకరణ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. కరోనా వ్యాధిని ఆరోగ్య విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఎన్‌డిఆర్ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ నిధి) నుంచి రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధికి తగిన మొత్తంలో డబ్బుల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

tag: Telangana, Disaster Response, Fund, Release, Corona, SDRF, Finance



Next Story

Most Viewed