ఆ స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా

by  |
ఆ స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతూ… విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారిన పడటంతో సామాన్య జనం తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం సున్నిపెంటలోని ఓ స్కూల్‌‌లో విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 29 మంది విద్యార్థులు పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డీఈవో సాయిరాం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా అన్ని స్కూళ్లలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story