దేశంలో 21లక్షలు దాటిన కేసులు

by  |
దేశంలో 21లక్షలు దాటిన కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు 60వేల మార్కు దాటింది. శనివారం ఉదయం బులెటిన్ వెల్లడించేసరికి గడిచిన 24గంటల్లో నమోదైన 61,537 కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,88,612కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి పలు రాష్ట్రాల కేసుల బులెటిన్‌లు వెలువడడంతో ఈ సంఖ్య 21 లక్షలు దాటింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 933మంది మరణించారు. కొత్తగా నమోదైన కరోనా మరణాలతో కలిపి కరోనాతో చనిపోయిన వారిసంఖ్య 42,518కి చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతుండగా కొత్తగా నమోదవుతున్న కేసుల పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 14లక్షల 27వేల మంది కోలుకోగా ప్రస్తుతం 6లక్షల 19 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల రికవరీ రేటు 68.32 శాతంగా ఉంది.

మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 12,822 కొత్త కేసులు నమోదై మొత్తం సంఖ్య 5,03,084కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో మరణించిన 275మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 17,367కు చేరింది. ఢిల్లీలో 24గంటల్లో కొత్తగా నమోదైన 1404 కొత్త కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,44,127కు చేరింది. ఇక్కడ కొత్తగా 16కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4098 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో 24గంటల్లో 5883 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,90,907కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 118మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4808కి చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,080కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 97 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1939 మంది ప్రాణాలు కోల్పోయారు.



Next Story

Most Viewed