కరోనా డేంజరే… కానీ వీళ్లకు కాదు!

by  |
కరోనా డేంజరే… కానీ వీళ్లకు కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశాలకు దేశాలే లాక్‌డౌన్ విధించడంతో కరోనా గురించి ఇప్పటికే ఉన్న భయం మరింత రెట్టింపవుతోంది. దీనికి తోడు లేనిపోని వాట్సాప్ ఫార్వర్డు మెసేజ్‌లు భయాందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. అయితే మరి నిజంగా కరోనా వస్తే వెంటనే మరణిస్తారా? పరిస్థితి ఏంటి?

అదేం లేదు. మీ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందనుకోండి కాస్త భయపడాలి అంతే తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి కరోనా డేటా చూస్తే ప్రపంచం మొత్తం మీద 5,42,533 కరోనా కేసులు ఉండగా వారిలో 24,369 మంది చనిపోగా, 1,26,257 మంది కోలుకున్నారు. ఇది పరిశీలిస్తే మరణ రేటు కంటే కోలుకుంటున్న వారి రేటు ఎక్కువ ఉంది. అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు.

మరి ఇంత కఠిన నిర్ణయాలు ఎందుకు?

కరోనా వచ్చిన తర్వాత కోలుకునే అవకాశం చాలా ఉన్నపుడు ప్రభుత్వాలు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడమెందుకని అడగొచ్చు. కరోనా జబ్బు సీరియస్ కాకపోవచ్చు, కానీ దాని వ్యాప్తి చాలా సీరియస్. ఎక్కువ మంది దీని బారిన డాక్టర్లకు ట్రీట్ చేయడం ఇబ్బందవుతుంది. ప్రత్యేకంగా దీనికి మందు లేని కారణంగా ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించే పరిస్థితి లేదు. అంతేకాకుండా వైరస్ మ్యూటేట్ అవుతున్న కారణంగా ప్రతి వ్యాధిగ్రస్తుడిని దగ్గరుండి అబ్జర్వు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వైరస్ సోకిన వారందర్నీ పరిశీలించే అవకాశం ఉండదు. దీంతో వైద్యుల మీద భారం పెరుగుతుంది.

భారాన్ని తట్టుకోలేక పోతున్న ఆసుపత్రులు

లాక్‌డౌన్ ద్వారా ఎంత కట్టడి చేద్దామని ప్రయత్నించినా రోజుకో 3 నుంచి 9 కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కేసుల్లో ఎక్కువగా ఆసుపత్రి సిబ్బంది, అత్యవసర సిబ్బంది, వైద్యులే ఉన్నారు. అలాగే చికిత్స చేస్తూ వైరస్ అంటించుకుని వైద్యులు చనిపోతుండటంతో తక్కువ జీతానికి పనిచేసే వైద్య సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ భయంతోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పనిచేసే సహాయక వైద్య సిబ్బంది భయపడి ఉద్యోగాలు మానేస్తున్నారు. అయితే కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన వారే ఇలా చేస్తుండటంతో భయాందోళనలు ఇంకా పెరిగిపోతున్నాయి.

ఇంతకీ ప్రాణభయం ఉందా? లేదా?

వ్యాప్తి చెందే రేటు తక్కువగా ఉన్నంత కాలం కరోనా సోకినప్పటికీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఐసోలేషన్‌లో ఉండి, హైడ్రేషన్ చేసుకుంటూ, సరిగా తింటూ రోగనిరోధక శక్తి పెంచుకుంటే కరోనాను వదిలించుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు ఉంటే కేవలం 6 నుంచి 9 మంది మాత్రమే వెంటిలేటర్‌లో ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వెంటిలేటర్‌లో ఉన్నవారు వయసు మీద పడి, డయాబెటిక్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారే. వీరికి మాత్రమే కరోనా ప్రాణభయం ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి కావాల్సినంత ఉన్నవాళ్లకి ఎలాంటి ప్రాణభయం ఉండదు. కాబట్టి వ్యాధి తెచ్చుకుని దాని నుంచి బయటపడడం కంటే అది రాకుండా ఇంట్లో ఉండటమే మంచిది.

Tags : Corona, COVID 19, Ventilation, No tension, No danger

Next Story

Most Viewed