కరోనా తగ్గింది.. ఐటీ కంపెనీలు ఓపెన్ చేసుకోవచ్చు

by  |
IT companies
X

దిశ, తెలంగాణ : రాష్ట్రంలో కరోనా కంట్రోల్ ఉన్నదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ తీవ్రత తగ్గిందని, ప్రజలెవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. మరో 6 నెలలు వరకు పరిస్థితులు ఇలానే ఉంటాయన్నారు. కొత్త రకం వస్తేనే థర్డ్ వేవ్ వాస్తుందన్నారు. కానీ ఇప్పట్లో కొత్త రకం వచ్చే ఛాన్స్ తక్కువే అని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఒకే పాఠశాలల్లో 5 కేసులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజల జీవన, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నారు.

ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఓపెన్ చేసుకోవాలన్నారు. తద్వారా లక్షలాది మందికి ఉపాధితో పాటు మానసిక సమస్యలు తొలగి పోతాయన్నారు. వైరల్ ఫివర్లు పెరుగుతున్నా బయపడాల్సిన అవసరం లేదన్నారు. మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్పెషల్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed