కరోనా విస్తరణను అడ్డుకోవాలి

by  |

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విస్తరించకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనపు డాక్టర్లు నియమించాలని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ సూచించారు. కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంకటరావుతో హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో భాగంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల పై జిల్లా కలెక్టర్ తో మంత్రి చర్చించారు. మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ ను విస్తరించకుండా ప్రవేట్ వైద్య కళాశాల నుంచి మరో 50 మంది డాక్టర్ లను తాత్కాలికంగా అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న లాక్ డౌన్ పై చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రజలు స్వచ్ఛందంగా ఆచరించేలా అవగాహన ను కల్పించాలన్నారు. కరోనా ఇంకా విస్తరించకుండా పూర్తి స్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ సురేందర్ పాల్గొన్నారు.

tags;Corona expansion should be stopped,minister sriniva goud conference



Next Story