ఏపీలో కరోనా విలయతాండవం.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

81
corona

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,816 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 4,528మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,96,755కి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1027 కేసులు నమోదు కాగా ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 992 కేసులు నమోదు అయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 62 కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 418మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మెుత్తం కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,63,934కు చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,508గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 18,313యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,17,96,337 సాంపిల్స్‌‌ని పరీక్షించడం జరిగిందని వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.