కరోనా : ఐరోపాలో డౌన్.. చైనాలో మళ్లీ పైపైకి

by  |
కరోనా : ఐరోపాలో డౌన్.. చైనాలో మళ్లీ పైపైకి
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడి నుంచి యూరోప్, గల్ఫ్, దక్షిణాసియా, అమెరికా దేశాలకు పాకింది. గత నెల రోజుల పాటు యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణ మృదంగం మోగించిన కొవిడ్-19 ఇప్పుడు కాస్త తగ్గు ముఖం పడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లలో కరోనా కారణంగా మరణించే వాళ్ల సంఖ్య తగ్గుతోందని.. పాజిటీవ్ కేసులు కూడా గతంలో కంటే తక్కువగానే నమోదవుతున్నట్లు అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కరోనాను కట్టడి చేశామని భావించిన చైనాలో రెండో దఫా కోవిడ్-19 విజృంభిస్తోంది. పలు దేశాల్లో చిక్కుకున్న చైనీయులను గత కొన్ని రోజులుగా ప్రత్యేక విమానాల ద్వారా చైనాకు తీసుకొని వస్తున్నారు. వారిలో అత్యధికులు కరోనా వైరస్ సోకిన వారే ఉంటున్నారు. ఆదివారం చైనాలో 108 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా.. వీరిలో 98 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా అధికారులు చెబుతున్నారు. చైనాలో కరోనా రెండో సారి విజృంభించడం ఖాయమని నిపుణులు హెచ్చరించినట్లే అక్కడ రెండో దఫా ప్రారంభమైంది. దీంతో మరి కొన్ని రోజుల్లో ఆంక్షలు సడలిద్దామని భావించిన చైనా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరి కొన్ని రోజుల పాటు భౌతిక దూరం పాటించే నియమాన్ని తప్పక పాటించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చైనాలో వైరస్ కనుగొన్న నాటి నుంచి 82,160 మంది కరోనా పాజిటీవ్‌గా నిర్థారించబడ్డారు. వీరిలో 3,341 మంది మరణించగా.. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కేవలం 1,156 మందే చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

tags: coronavirus, china, europe, surging, cases, covid 19

Next Story

Most Viewed