దేశంలో కరోనా విజృంభణ.. భారీగా నమోదవుతున్న కొత్త కేసులు..

120
corona

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు వస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా ప్రజలు ఇంకా పెడచెవిన పెడుతున్నారు. ఇవాళ ఒక్క రోజే దేశంలో భారీగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లోనే 16.67 శాతం పాజిటివిటీ రేటు నమోదు అయింది. దేశంలో 2,68,834 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 14,17,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో వైపు రికవరీ కేసులు సంఖ్యకూడా భారీగానే ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 1,22,685 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.