తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

by  |
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అంతకంతకు కరోనా కేసులు భారీగా నమోదు కావడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,052 కేసులు నమోదు కాగా .. ఏడుగురు మృతి చెందారు. తెలంగాణ మొత్తంలో 3,32,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,772 మంది మృత్యువాత పడ్డారు. అటు 24,131 యాక్టివ్ కేసులు నమోదు కాగా..3,06,678 డిశ్చార్చ్ అయ్యారు. ఇకపోతే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.

Next Story

Most Viewed