లాక్ డౌన్ ఉన్నా.. వీధుల్లో పోకేమాన్ ఆడుతున్న తాత

by  |
లాక్ డౌన్ ఉన్నా..  వీధుల్లో పోకేమాన్ ఆడుతున్న తాత
X

దిశ వెబ్ డెస్క్: కరోనా.. చైనాను కుప్పకూల్చింది. ఇటలీ ప్రజల్ని పొట్టనపెట్టుకుంది. స్పెయిన్ ను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ పౌరులంతా . . కరోనాకు భయపడి ఇల్లకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం కూడా.. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. పిల్లలు, యువకులు, వృద్దులు ఎవరన్నది… కరోనాకు అవసరం లేదు. తన పని తాను చేసుకుపోతుంది. అందుకే ప్రజలెవర్నీ బయటకు రావద్దు.. కరోనా సోకితే పోతావ్.. అంటూ ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరిస్తున్నాయి. వృద్ధులనైతే బయట కాలు పెట్టాలనే ఆలోచనే చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ 77 ఏళ్ల తాత వీధుల్లో భయం లేకుండా పోకేమాన్ ఆడుతున్నాడు.

మొదట చైనాలో ‘కరోనా’ విజృంభించడంతో.. ప్రజలంతా పిట్టల్లా రాలిపోయారు. దాన్ని కట్టడి చేయడానికి .. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేశారు. కరోనా .. .మన దేశంలో నూ వ్యాప్తి చెందుతుండటంతో… 21 రోజుల వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అలాగే కరోనా నేపథ్యంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో కూడా లాక్‌డౌన్ విధించారు. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు. నిబంధన ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఓ తాత మాత్రం … తనకు కరోనా రాదానుకున్నాడో.. లేక… రోడ్ల ఖాళీగా ఉన్నాయి కదా సూపర్ గా ఆడుకోవచ్చని అనుకున్నాడో ఏమో కానీ… ‘పోకేమాన్’’ అడుతూ… వీధుల్లో తిరిగాడు. దాంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. బయటకు ఎందుకు తిరుగుతున్నావ్? అని ప్రశ్నిస్తే.. తాను పోకేమాన్ ఆడుతున్నానని చెప్పాడు.

ట్విట్టర్ లో షేర్ చేసిన పోలీసులు:

ఈ మొత్త సంఘటనను వివరిస్తూ.. మాడ్రిడ్ పోలీసులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. పోకేమాన్, డైనోసార్ల వంటి మ్యాజికల్ క్రీచర్స్‌ ఆడుతూ వీధుల్లోకి రావడం నిషేదం. అలా వచ్చినవారిని విడిచిపెట్టం’’ అని పోలీసులు ట్వీట్ చేశారు. పోకేమాన్ ఆడుతున్న ఆ తాతను అరెస్టు చేయడంతోపాటు భారీ జరిమానా విధించామని తెలిపారు. ప్రస్తుతం స్పెయిన్‌లో 42,058 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 2,991 మంది చనిపోయారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ప్రజలు మాత్రం ఇళ్లల్లో ఉండటం లేదు. ఇండియా కంటే ముందుగానే మార్చి 14 నుంచి ఇక్కడ లాక్‌డౌన్ నడుస్తోంది. నిబంధనలు పాటించని 4,800 మందిపై కేసులు నమోదు చేశారు.

tags: coronavirus, pokemon, dinosaur, police, china, spain, lockdown, old man

Next Story