జగన్ రెడ్డి రక్షకా గోవిందా… శ్రీవారి సన్నిధిలో జగన్ నామస్మరణ (వీడియో)

1137
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని మంగళవారం సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్న విషయం తెలిసిందే. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే శ్రీవారిని దర్శించుకున్న సమయంలో జగన్ తీరుపై హిందూ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

 

ఈ క్రమంలో జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి జగన్‌పై సెటైర్లు పేల్చారు.’ మీ పాపాలకు ప్రాయ‌శ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండ‌ల‌వాడి సేవ‌చేసే అవ‌కాశం దొరికితే…ఆ స్వామికే అప‌చారం త‌ల‌పెట్టే ప‌నులు మంచిది కాదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారూ! ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుక‌గా ఇచ్చి, బాబాయ్ కోటాలో మిమ్మల్ని ఈ స్కీంకి ఎంపిక చేయ‌ని అబ్బాయి వైఎస్ జగన్ మీ పాలిట దేవుడే కావొచ్చు. ఆయ‌న ఫోటో మీ ఇళ్లల్లో పెట్టి పూజించుకోండి.. దేవుడిగా కొలుచుకోండి..వీలైతే పాద‌పూజ చేసుకోండి. కొండ‌పై గోవింద‌నామాల బ‌దులు జ‌గ‌న్‌ నామస్మరణ మ‌హాప‌రాధం. స్వామి అమ్మవార్లకు ప‌దేప‌దే అప‌చారాలు త‌ల‌పెడుతూ.. మ‌ళ్లీ జ‌గ‌న్‌రెడ్డిని ర‌క్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్ స‌తీమ‌ణి అప‌చార‌పు నామ‌స్మరణ స్వామివారికి తీర‌ని క‌ళంకం’ అని విమర్శలు గుప్పించారు.

భ‌క్తి వుంటే భార్య ఎందుకు రాదు?. వేద‌పండితులు త‌ల‌పై వేసిన అక్షింతల్ని అస‌హ్యంగా దులుపుకోవ‌డం, ప్రసాదం వాస‌న చూడ‌టం….స్వామిపై ఎందుకీ దొంగ దైవ‌భ‌క్తి జ‌గ‌న్‌రెడ్డి గారూ?’ అని లోకేష్ మండిపడ్డారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..