లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్ యాదయ్య

by  |
arrest
X

దిశ, మహేశ్వరం : మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో 25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ యాదయ్య అడ్డంగా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజ్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై భూ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఈ క్రమంలో బాధితులకు 41ఏ సీఆర్పీసీ క్రింద స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి కానిస్టేబుల్ యాదయ్య రూ.25 వేలు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా డిమాండ్ చేసిన డబ్బులో ఎస్సైకి రూ. 20వేలు, యాదయ్యకు రూ.5వేలు అని బాధితులకు చెప్పాడు. దీంతో సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో దాడి చేసి యాదయ్య లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed