రేవంత్‌ రాకతో రేషన్ కార్డులు.. వద్దంటూ సర్పంచ్ సెల్ఫీ వీడియో..!

by  |
రేవంత్‌ రాకతో రేషన్ కార్డులు.. వద్దంటూ సర్పంచ్ సెల్ఫీ వీడియో..!
X

దిశ, కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న రేషన్ కార్డులను తమ గ్రామంలో బహిష్కరిస్తున్నామని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడుతూ.. తమ గ్రామంలో రేషన్ కార్డులు రానివారు చాలా మంది ఉన్నారని అన్నారు. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, కేవలం 23 మందికి మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ క్యాంప్ ఆఫీసులో పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని తాము బహిష్కరించామని తెలిపారు. ప్రసాదం మాదిరిగా రేషన్ కార్డులను మంజూరు చేయడం సరికాదన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా మంజూరు చేయని రేషన్ కార్డులను నేడు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఎంపిక కాగానే కార్డులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసమే సీఎంకు దళితులు గుర్తుకు వచ్చారని దుయ్యబట్టారు. కేవలం హుజురాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఉన్న దళిత, బహుజన, బలహీన వర్గాలందరికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో కార్డులు రానివారితో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed