రంగంలోకి టీ కాంగ్రెస్.. నేటి నుంచి వరి దీక్ష

by  |
రంగంలోకి టీ కాంగ్రెస్.. నేటి నుంచి వరి దీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుల సమస్యలపై కాంగ్రెస్​ పార్టీ నిరసనకు దిగుతోంది. యాసంగిలో వరి సాగు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వరి దీక్ష చేస్తోంది. కిసాన్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేపట్టే ఈ దీక్షలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి వరి దీక్షను మొదలుపెడుతున్నట్లు కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కాంగ్రెస్​ నేతలు ఈ దీక్షలోనే ఉండనున్నారు.

వరి దీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా రైతులతోనే ఈ దీక్ష చేపడుతున్నారు. ఇప్పటికే కల్లాల్లోకి కాంగ్రెస్​ నినాదంతో పార్టీ శ్రేణులు జిల్లాల్లో పర్యటించారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు దిగారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యం మొత్తం రోడ్లపై ఉందని, తడిసి మొలకలు వచ్చిందని, అయినా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వానాకాలం ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, యాసంగిలో వరి సాగు చేసుకునే విధంగా రైతులకు స్వేచ్ఛను కల్పించాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్​ ఈ వరి దీక్ష చేస్తోంది.


Next Story

Most Viewed