కాంగ్రెస్ ఆన్‌లైన్ ఉద్యమం

by  |
కాంగ్రెస్ ఆన్‌లైన్ ఉద్యమం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆదివారం ఆన్‌లైన్ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి గవర్నర్ వ్యవస్థను బీజేపీ వినియోగిస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.

బీజేపీ తీరును నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆదివారం ఆన్‌లైన్‌ ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘స్పీక్ అప్ డెమోక్రసీ’ పేరిట అన్ని సామాజిక మాధ్యమాల్లో తమ నిరసన గొంతుకను వినిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. అదే విధంగా సోమవారం రాజ్‌భవన్ దగ్గర కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపడుతుందని, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఉత్తమ్ పేర్కొన్నారు.

Next Story