కేసీఆర్ ‘సాగర్’ బహిరంగ సభతోనే వేలాది మందికి కరోనా

by  |
కేసీఆర్ ‘సాగర్’ బహిరంగ సభతోనే వేలాది మందికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సామాన్య జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ కీలక నేత, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. మోడీ, కేసీఆర్‌లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో నిర్వహించిన బహిరంగ సభ మూలంగానే వేలాదిమందికి కరోనా సోకిందని మండిపడ్డారు. ఆయుష్మాన్ భవ స్కీమ్ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటివరకూ ఒక్క సమీక్ష కూడా జరుపలేదని వెల్లడించారు.



Next Story

Most Viewed