శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు…చెంచా: జగ్గారెడ్డి

by  |
శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు…చెంచా:  జగ్గారెడ్డి
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో మంత్రులు చెంచాగిరి చేస్తున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ప్రతీ ఒక్కరూ బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా గురించి మాట్లాడే మంత్రి శ్రీనివాస్ యాదవ్ గాంధీ హాస్పిటల్‌కు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో మనం చేసేది దంగల్ కాదని, పహిల్వాన్ గిరి బంద్ చేయాలని మంత్రులకు హితవు పలికారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదని సీఎం కేసీఆర్ చెప్పింది చేయడానికి ఉన్న చెంచా అని విమర్శించారు. ఉద్యోగుల గురించి సీఎం ప్రకటన చేయగానే మంత్రి శ్రీనివాస్ గౌడ్, మమత అనే ఉద్యోగి ఎందుకు స్వీట్ తినిపించుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘం నేత మమత భర్త రిటైర్మెంట్ అయినా సర్వీసును మళ్లీ ఎలా పొడిగించారని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చరిత్ర టైం వచ్చినప్పుడు బయటపెడుతానని, శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు… బ్రోకర్ అంటూ జగ్గారెడ్డి చెప్పారు. మంత్రులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణను అప్పుల రాష్ట్రమని పేరు మార్చాల్సి వస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story