మఠంపల్లిలో పీఎస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

by  |
మఠంపల్లిలో పీఎస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా
X

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ ప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేపట్టారు. ఈమేరకు శనివారం స్టేషన్ ముందు నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ అసభ్యపదజాలంతోదూషిస్తున్నాడని వారు ఆరోపించారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 6న పెడవీడు గ్రామంలో కరీం అనే కాంగ్రెస్ నాయకుడి ఇంటిపై టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేసిన ఘటనపై స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేసినా, ఎస్ఐ పట్టించుకోలేదని ఆరోపించారు. తక్షణమే ఎస్ఐ‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇంటిపై దాడి ఘటనలో కేసు పెట్టడానికి స్టేషన్‌కు వెళితే మహిళ అని చూడకుండా ఎస్‌ఐ తనను అసభ్య పదజలంతో దూషించాడని కరీం భార్య వాపోయింది. తమకు న్యాయం చేయాలంటూ ఆమె స్టేషన్ ముందు పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, మంజునాయక్, భూక్యా గోపాల్, మోతిలాల్, తన్నీరు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed