కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చండి : కాంగ్రెస్

by  |
కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చండి : కాంగ్రెస్
X

దిశ, సిద్దిపేట: రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాకు కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పాటు, ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం డిమాండ్ చేశారు. శనివారం టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరితో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కేసులు పెరగడం, ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదే విధంగా మరణాల రేటు కూడా పెరుగుతోందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి దాపురించిందని, కావున వెంటనే ప్రతి జిల్లాకు ఒక కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం కరోనా మహమ్మారి వలన భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. మొదట్లో కరోనా ట్రీట్ మెంట్ కోసం రాష్ట్రానికి రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయిస్తుమని చెప్పిన సీఎం, అవి సరిపోకుంటే ఎన్ని వేలకోట్లు ఖర్చు చేసి కరోనాను కట్టడి చేస్తామని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. నేడు 30వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా.. పట్టించుకోకుండా దొంగలా ప్రజలకు కనపడకుండా దాక్కున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అయితే, కరోనా బారిన పడిన పేదవారికి వైద్యం చేయించుకునే స్తోమత లేదని, అందువల్ల కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ లో వెంటనే చేర్చాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో చిన్న కొండూరు మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, కనకరాజు, ఫయాజ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed