తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకే రక్షణ లేదు: కాంగ్రెస్ నేతలు

by  |
తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకే రక్షణ లేదు: కాంగ్రెస్ నేతలు
X

దిశ, ముధోల్: భైంసాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ డిమాండ్ చేశారు. భైంసాలోని యస్‌యస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేసిన ఆయన మాట్లాడారు. రాష్ర్టంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంటే.. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఏం చేస్తున్నారని నిలదీశారు. విగ్రహ ధ్వంసం చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీస్ అధికారులు ప్రకటించడం కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర అని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, రూ. 25 లక్షలతో పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కుంటాల ఎంపీపీ గజ్జరం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్నాప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed