అభివృద్ధికి దేవుని ఆస్తులు వాడుకోవడం సరికాదు

by  |
అభివృద్ధికి దేవుని ఆస్తులు వాడుకోవడం సరికాదు
X

దిశ, సిద్దిపేట: తిరుమల దేవస్థానం ఆస్తులను కుదువబెట్టి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి దేవుని ఆస్తుల నుండి వచ్చిన వడ్డీతోనే పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఆస్పత్రులను గత ముఖ్యమంత్రులు నిర్మించారనీ అన్నారు. వైయస్సార్ కూడా వాటి జోలికి పోలేదని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న ఆభరణాలను కుదువపెట్టి, దానితో వచ్చిన డబ్బులను రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టు కోవాలని అనుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు. గతంలో వెయ్యికాళ్ల మంటపాన్ని కూల్చడానికి ప్రయత్నించినప్పుడు మాట్లాడిన చిన్న జీయర్ స్వామి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర నుండి కొంతమంది నాయకులు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడాలని తనకు సూచించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed