గ్రేటర్​లో కాంగ్రెస్​ కమిటీలు

by  |
గ్రేటర్​లో కాంగ్రెస్​ కమిటీలు
X

దిశ, తెలంగాణ, బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జీలను ప్రకటించింది. గ్రేటర్​ పరిధిలోని పార్లమెంట్​ నియోజకవర్గాలకు ఎన్నికల కమిటీలను ఖరారు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలోనే వార్డుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​రెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా బుధవారం పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేయాలని, ఈనెల 19న వారికి బీఫారాలను అందించాలని సూచించారు. గతంలో గ్రేటర్​లో ఉన్న పట్టును నిలుపుకోవాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికోసం జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఈనెల 21న కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేయనుంది. పార్టీ ముఖ్యనేతలు రేవంత్‌‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

హైదరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గానికి ఎన్నికల కమిటీలో అంజన్​ కుమార్​ యాదవ్​, ఫిరోజు ఖాన్​, జాఫర్​ జావేద్​, నిరంజన్​, షేక్​ అబ్దుల్లా సోహైల్​ను నియమించగా… పీసీసీ కో ఆర్డినేటర్​గా మాజీ మంత్రి షబ్బీర్​ అలీ వ్యవహరించనున్నారు. అదే విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్​ సెగ్మెంట్‌కు వీహెచ్, మర్రి శశిధర్​రెడ్డి, అంజన్​ కుమార్​ యాదవ్​, విష్ణువర్ధన్​రెడ్డి, దాసోజు శ్రవణ్​, సంతోష్​ కుమార్​లు ఇంఛార్జీలుగా ఉండగా పీసీసీ కో ఆర్డినేటర్​గా భట్టి విక్రమార్కను నియమించారు. చేవేళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ ఎన్నికల కమిటీలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి, మహ్మద్​ అజహరుద్దీన్​, చల్లా నర్సింహరెడ్డి, బిక్షపతి యాదవ్​, రాచమల్ల సిద్ధేశ్వర్​, దీపా భాస్కర్​రెడ్డిని నియమించగా పీసీసీ కోఆర్డినేటర్​గా పొన్నం ప్రభాకర్​ వ్యవహరించనున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్​లో రేవంత్​రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్​, చల్లా నర్సింహరెడ్డి, నందికంటి శ్రీధర్​, బడేసాబ్​ ఉండగా పీసీసీ కో ఆర్డినేటర్​గా జీవన్​‌రెడ్డి ఉన్నారు. మెదక్​ పార్లమెంట్​కు దామోదర రాజనర్సింహా, విజయశాంతి, గీతారెడ్డి, జగ్గారెడ్డి, అనిల్​ కుమార్​ ఉండగా జెట్టి కుసుమ కుమార్​ పీసీసీ కో ఆర్డినేటర్​గా వ్యవహరించనున్నారు.

Next Story