జెండా పండగ వేళ.. టీఆర్ఎస్‌లో బయటపడ్డ విభేదాలు..

by  |

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండగను గురువారం సంబురంగా నిర్వహించాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో వర్గపోరు బయట పడింది. రెండు గ్రూపుల వారు పార్టీ జెండా ఎగరవేయడానికి పోటీ పడి గొడవకు దిగారు. ఒకరినొకరు దూషించుకుని ఆధిపత్యం కోసం నినాదాలు చేశారు. కొంత సేపు ఘర్షణకు దిగి చివరకు గ్రూపులతో సంబంధం లేని పార్టీ మాజీ అధ్యక్షుడి చేత జెండా అవిష్కరించారు.

అయితే ఈ గలాటా కారణంగా పార్టీ జెండాను రివర్స్‌లో ఎగరేసిన నాయకులు, అంతలోనే తేరుకొని జెండాను సరిచేశారు. అదేవిధంగా సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో పార్టీలో ఉన్న వర్గ పోరు కారణంగా ఎవరు కూడా పార్టీ జెండా ఎగర వేయలేదు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గ్రూపు విభేదాల కారణంగా కొన్ని చోట్ల పార్టీ జెండాను ఎగరవేయక పోగా, మరికొన్ని ప్రాంతాల్లో రెండేసి చోట్ల జెండా పండుగ జరుపుకున్నట్లు సమాచారం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed